ఇంజిన్‌లో సమస్య.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
తిరువనంతపురం నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన వెంటనే ఇంజిన్‌లో సమస్య గుర్తించిన పైలట్లు.. వెంటనే ఎమర్జెన్సీ ల్యాడింగ్ చేశారు. రెండో ఇంజిన్‌లో ఇంధనం తక్కువగా ఉందని హెచ్చరిక వచ్చింది. దీంతో పైలట్లు గాలిలో ఉండగానే ఏటీసీకి 'పాన్-పాన్' అలర్ట్ పంపించారు. అత్యవసర పరిస్థితుల్లో ల్యాండింగ్ ప్రియారిటీకి ఈ హెచ్చరికను వాడుతారు.