VIDEO: లాలాపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ
గుంటూరు నగరంలోని లాలాపేట పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించి, సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పనితీరు, రికార్డులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గుంటూరు నగరంలో క్రైమ్ పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.