బుక్కపట్నంలో ఎమ్మెల్యే పల్లె సింధూర
ATP: మండల కేంద్రమైన బుక్కపట్నం గ్రామంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర చే పింఛన్ల పంపిణీ జరిగింది. సోమవారం ఉదయం గ్రామంలోని తేరు కూడలిలో ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తోపాటు స్థానిక నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన అనంతరం పింఛను పంపిణీ చేశారు.