నేడు బొందిమడుగులకు మందకృష్ణ మాదిగ రాక
KRNL: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ మంగళవారం పత్తికొండకు రానున్నారు. 11 గంటలకు బొందిమడుగుల గ్రామానికి చేరుకుని ఎమ్మార్పీఎస్ నేత బొందిమడుగుల రమేశ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, మాదిగ కుటుంబీకులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని జిల్లా అధ్యక్షుడు సుభాష్ చంద్ర మాదిగ పిలుపునిచ్చారు.