ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
చిత్తూరులోని తన కార్యాలయంలో ఇవాళ ఎమ్మెల్యే గురుజాల జగన్‌మోహన్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించారు. వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు.