"దేవాలయ భూముల్లో పనులు ఆపాలి"

"దేవాలయ భూముల్లో పనులు ఆపాలి"

NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తిలో సర్వే నం. 201లోని దేవాలయ ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్ లాభం కోసం అధికారులు ధారాదత్తం చేస్తున్నారని బీజేపీ నాయకుడు మర్రి హరీష్ రెడ్డి ఆరోపించారు. రైతుల పేరుతో 40 ఫీట్ల రోడ్డు వేస్తూ కలెక్టర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారని విమర్శించారు. ఈ మేరకు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.