VIDEO: 'త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి'

MDK: ప్రజలకు త్రాగునీరు అందించడానికి అధికారులు బాధ్యత తీసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సున్నిత లక్ష్మారెడ్డి సూచించారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇటీవల మిషన్ భగీరథ నీటి సరఫరా మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు.