నేడు పాలేరు పాత కాలువకు నీరు విడుదల

నేడు పాలేరు పాత కాలువకు నీరు విడుదల

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో కూసుమంచి మండలం పాలేరులోని పాత కాలువ గండీ పనులను ఇరిగేషన్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. గురువారం మధ్యాహ్నం పాత కాలువకు ఐబి ఆఫీసర్లు నీటిని విడుదల చేయనున్నారు. ఖరీఫ్ సీజన్‌లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో నీటిని విడుదల చేయనున్నారు. పాలేరు పాత కాలువ పరివాహకంలో 60 వేల ఎకరాల వరిసాగు ఉంది.