VIDEO: మొదలైన మున్సిపల్ ఎన్నికల సందడి
WNP: మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికల సందడి మొదలైంది. ఆదివారం ఉదయం బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో 17వ వార్డులో పార్టీ బలపరిచిన అభ్యర్థి మండ్ల రాజును గెలిపించాలని నాయకులు ప్రచారం చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.