VIDEO: యువకుడుపై ఆటో డ్రైవర్ కత్తితో దాడి
MNCL: శుభకార్యానికి హాజరై కారులో వెళ్తుండగా.. ఓ యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన నెన్నెలలో చోటుచేసుకుంది. చీర్ రాకేష్‌పై నెన్నెల మండలానికి చెందిన ఆటో డ్రైవర్ కొడిపె అశోక్ కత్తితో దాడి చేశాడు. ఆటోకు కారు తగలడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రాకేష్ ఛాతిలో ఆటో డ్రైవర్ రెండు చోట్ల కత్తితో పొడిచాడు. ఈ మేరకు నెన్నెల SI ప్రసాద్ కేసు నమోదు చేశారు.