గోడ కూలి వ్యక్తి మృతి

ELR: కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమానికి టెంట్లు ఏర్పాటు చేశారు. ఈ టెంట్లు తొలగిస్తున్న సమయంలో కూలీపై గోడ కూలి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన గురువారం ఏలూరులోని తంగళ్ళమూడి ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతుడు స్థానికంగా బాలాజీ టిప్ టాప్‌లో పనిచేస్తున్న కోన సాయి(22)గా గుర్తించారు. ఈ ఘటనపై టూ టౌన్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.