సూర్యాపేట - ఖమ్మం హైవేపై అదుపు తప్పిన వాహనం

సూర్యాపేట - ఖమ్మం హైవేపై అదుపు తప్పిన వాహనం

SRPT: సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే హైవేపై చివ్వేంల మండలం చందుపట్ల గ్రామ సమీపంలో ఓ డీసీఎం వాహనం అకస్మాత్తుగా అదుపుతప్పి పక్కనే ఉన్న కోళ్ల ఫారంలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో కోళ్ల ఫారంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో సహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు, అందరూ సురక్షితంగా బయటపడ్డారు.