అందరినీ ఆకట్టుకుంటున్న మే పుష్పం

అందరినీ ఆకట్టుకుంటున్న మే పుష్పం

MNCL: సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వికసించే మే పుష్పం జన్నారం మండల కేంద్రంలో విరబూసింది. మండలంలోని పోన్కల్ గ్రామానికి చెందిన మోహన్ రెడ్డి ఇంటి ఆవరణలో మే పుష్పం వికసించింది. కేవలం మే నెలలో మాత్రమే పూసే పువ్వు కావడంతో దానికి మే పుష్పం అని పేరు వచ్చిందని యజమాని వెల్లడించారు. ప్రస్తుతం మే పుష్పం అందరినీ ఆకట్టుకుంటుంది.