'రైతుల అవసరాలకు ఎరువులు అందేలా చూడాలి'

'రైతుల అవసరాలకు ఎరువులు అందేలా చూడాలి'

GDWL: రైతుల అవసరాలకు ఎరువులు అందేలా చూడాలని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. బుధవారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో వర్షాకాలంలో సాగైన పంటల విస్తీర్ణం, యూరియా నిల్వలు, విక్రయాల గురించి సమీక్షించారు. ప్రస్తుతం జిల్లాలో నిల్వ ఉన్న 543 మెట్రిక్ టన్నుల యూరియాను పద్ధతి ప్రకారం అవసరమైన రైతులకు అందజేయాలన్నారు.