VIDEO: CMRF చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

కృష్ణా: మొవ్వ మండలం పెదముత్తేవిలో CMRF కింద రూ. 20,524 చెక్కును తోడేటి అగ్గిరాముడు అనే వ్యక్తికి ఎమ్మెల్యే కుమార్ రాజా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కింద బాధితులకు రెండున్నర కోట్లు అందించినట్లు పేర్కొన్నారు. పేదల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని ఆయన తెలిపారు .