జిల్లాలో కార్డన్ సెర్చ్

జిల్లాలో కార్డన్  సెర్చ్

TPT: జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పోలీసులు ఏకకాలంలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. అనుమానాస్పద ప్రాంతాలు, అద్దె ఇళ్లు తనిఖీ చేసి నివాసితుల వివరాలు సేకరించారు. అలాగే వాహనాలను పరిశీలించి పత్రాలు లేని వాహనాలపై చర్యలు తీసుకున్నారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వాలన్నారు.