నిత్యావసరాల ధరలపై యుద్ధం ఎఫెక్ట్
యుద్ధం ఎఫెక్ట్ నిత్యావసరాల ధరలపై పడింది. అంతర్జాతీయంగా ఎరువుల సరఫరాకు బ్రేకులు పడ్డాయి. 30 శాతం ఎరువులు హర్మూజ్ జలసంధి నుంచే రవాణా చేస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో ఆ నౌకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో తీవ్రంగా ఎరువుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు క్రూడాయిల్ ధరలు పెరిగాయి. ఆహార సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని, ద్రవ్యోల్బణం పెరిగి ఛాన్స్ ఉందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.