VIDEO: ఆర్టీసీ బస్సు నడిపిన చింతమనేని
ELR: పెదవేగి మండలంలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు ఏలూరు చదువుకునేందుకు వస్తున్న నేపథ్యంలో వారికి బస్సు సౌకర్యం లేదని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. శుక్రవారం అధికారుల ఆదేశాల మేరకు బస్సును ఏర్పాటు చేయడంతో ఎమ్మెల్యే చింతమనేని విద్యార్థులతో కలిసి బస్సు డ్రైవ్ చేశారు.