సిరిపురంలో అదుపుతప్పి బోల్తా పడిన ధాన్యం ట్రాక్టర్

సిరిపురంలో అదుపుతప్పి బోల్తా పడిన ధాన్యం ట్రాక్టర్

SRPT: నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఇవ్వాళ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. పొలంలో కోసిన వడ్లను ట్రాక్టర్‌లో ఇంటికి తరలిస్తుండగా, మార్గమధ్యలో అదుపుతప్పి బోల్తా పడటంతో ధాన్యం రోడ్డుపాలైంది. ఈ ఘటనలో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు ఎటువంటి గాయాలు కాలేదని గ్రామస్తులు తెలిపారు.