'స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి'

'స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి'

AKP: త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలకు జనసైనికులు సన్నద్ధం కావాలని జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ సూర్యచంద్ర పిలుపునిచ్చారు. ఇవాళ నర్సీపట్నంలో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు కానుకగా ఇవ్వాలని కోరారు. దీనికోసం ఇప్పుటి నుంచే శ్రమించాలన్నారు.