ఎన్నికల విధులకు డుమ్మా.. ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్

ఎన్నికల విధులకు డుమ్మా.. ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్

JGL: జిల్లాలో పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన ముగ్గురు ఉద్యోగులను కలెక్టర్ సత్య ప్రసాద్ సస్పెండ్ చేశారు. DEC 11న జరిగిన ఫేజ్-1 విధులకు వీరు హాజరుకాలేదు. దీనిపై జారీ చేసిన షోకాజ్ నోటీసులకు వారు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో సస్పెన్షన్ వేటువేశారు. సస్పెండైన వారిలో ఇద్దరు జూనియర్ లెక్చరర్లు, ఒక స్కూల్ అసిస్టెంట్ ఉన్నారు.