కొయ్యూరు మండలంలో కార్తీక పౌర్ణమి పండుగ శోభ

కొయ్యూరు మండలంలో కార్తీక పౌర్ణమి పండుగ శోభ

అల్లూరి: కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం కొయ్యూరు మండలంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజామున లేచి స్నానాలు ఆచరించి, శివాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కొయ్యూరు మల్లికార్జునస్వామి ఆలయం వద్ద భక్తుల సందడి నెలకొంది. ఆలయ అర్చకులు వేద మంత్రాలు చదివి పూజలు నిర్వహించారు. అలాగే మాకవరం, గాదిగుమ్మి ఆలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది.