రైతులకు అన్యాయం జరగదు: ఎమ్మెల్యే
అన్నమయ్య: మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ.. రైతులు, మండి నిర్వాహకులకు అన్యాయం జరగకుండా చూస్తానని తెలిపారు. మార్కెట్‌లో టమోటా రైతులను వ్యాపారులు మోసం చేస్తే సహించేది లేదని, రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి మార్కెట్ చైర్మన్ జంగాల శివరాం అధ్యక్షత వహించారు.