గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

KRNL: నగరంలో వచ్చే నెల 4న నిర్వహించనున్న గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మున్సిపల్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి వినాయక ఘాట్ పరిశీలించారు. మునుపటి కంటే మెరుగ్గా ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.