'యువత నాయకత్వాన్ని అందిపుచ్చుకోవాలి'

'యువత నాయకత్వాన్ని అందిపుచ్చుకోవాలి'

VSP: యువతరం నాయకత్వాన్ని అందిపుచ్చుకోవాలని వో.ఎన్.జీ.సీ. సీజీఎం (హెచ్ఆర్) రేపల్లె శ్రీరామారావు అన్నారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల విద్యార్థులనుద్దేశించి మంగళవారం ఆయన నాయకత్వం అంశంపై ప్రసంగించారు. నాయకుడిగా రాణించాలని అనుకునే వ్యక్తులు ముందుగా స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండాలని తెలిపారు.