కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసిన ఎంపీ ఈటల

మేడ్చల్: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై కేంద్రమంత్రికి వినతి పత్రం అందించారు. ఇతర కారణాలతో మరణించిన కార్మిక కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. అలాగే, మేడారం జాతరకు రైల్వే సౌకర్యం కల్పించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.