VIDEO: శ్రీశైలంలో ఆది దంపతులకు వైభవంగా ఊయలసేవ
NDL: శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు సోమవారం విశేష పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో భాగంగా స్వామి, అమ్మవార్లకు ఊయల సేవలను నిర్వహించారు. ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సేవా సంకల్పాన్ని పఠించి, మహాగణపతిపూజ జరిపించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకిలో ఆశీనులను చేసి షోడశోపచార పూజలు జరిపారు.