నగ్న వీడియోలతో వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం

బాపట్ల: నగ్న వీడియోలు, ఫొటోలు వైరల్ చేస్తానని సహజీవనం చేస్తున్న యువకుడు వేధించడంతో మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మంగళవారం కొల్లూరులో జరిగింది. ASI అర్జున్ వివరాల ప్రకారం.. పోతార్లంకకు చెందిన మహిళను భర్త వదిలేయడంతో పిల్లలతో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. తనతో సహజీవనం చేస్తున్న గొపీకృష్ణ ఆమెను డబ్బు కోసం బెదిరించడంతో ఆత్మహత్యాయత్నం చేసుకుని ఆసుపత్రిలో ఉంది.