గణేష్ నిమజ్జన ఘాట్‌ను పరిశీలించిన జిల్లా అధికారులు

గణేష్ నిమజ్జన ఘాట్‌ను పరిశీలించిన జిల్లా అధికారులు

KMM: కాల్వవోడ్ధు మున్నేరు వద్ద జరిగే గణేష్ నిమజ్జనం ప్రాంతాన్ని ఇవాళ అదనపు కలెక్టర్ శ్రీజ, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, పరిశీలించారు. శోభాయాత్ర, నిమజ్జన సమయాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రహదారిపై అడ్డుగా వైర్లు, చెట్టు కొమ్మలు లేకుండా చొరవ తీసుకోవాలని అధికారులను సూచించారు. ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు.