ఇప్పటివరకు పోలింగ్ శాతం ఎంతంటే..?
కొమురంభీం ఆసీఫాబాద్ జిల్లాలో ఇప్పటివరకు అత్యల్పంగా 7.85 శాతం నమోదయ్యింది. ఇవాళ ఉదయం 7 గంటలకు తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. చలిని సైతం లెక్క చేయకుండా ఓటు వేయడానికి ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రం వద్దకు వస్తున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.