రేపే మొదటి విడత పల్లెపోరు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 555 జీపీలు, 4952 వార్డులకు మొదటి విడత ఎన్నికలు రేపు జరగున్నాయి. జిల్లాలో ఇప్పటికే 53 జీపీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్ ప్రారంభం కాగా సాయంత్రానికి ఫలితాలు వెల్లువడనున్నాయి.