'రైతులకు తగిన పరిహారం అందిస్తాం'

'రైతులకు తగిన పరిహారం అందిస్తాం'

W.G: నరసాపురం మండలంలోని సీతారాంపురం, చినమైనవానిలంక గ్రామాలలో బుధవారం ఎమ్మెల్యే నాయకర్ సందర్శించారు. తుఫాన్ కారణంగా స్థానికంగా ఉన్న పరిస్థితులను పరిశీలించారు. ప్రత్యేకంగా రైతుల పొలాలు, ఆక్వా రైతుల యొక్క ఫార్మ్‌లు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి చూసి వారి బాధలు తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున నష్టపోయిన రైతుక తగిన పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.