సమ్మె నోటీసు ఇచ్చిన మున్సిపల్ కార్మికులు

PLD: వినుకొండ మున్సిపల్ కార్మికులు మే 20న సార్వత్రిక సమ్మెలో పాల్గొననున్నట్లు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్‌కు గురువారం నోటీసు అందజేశారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు మారుతీ వరప్రసాద్, బూదాల శ్రీనివాసరావు తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని వారు స్పష్టం చేశారు.