VIDEO: శివ నామస్మరణతో మార్మోగిన వీరభద్రస్వామి ఆలయం

VIDEO: శివ నామస్మరణతో మార్మోగిన వీరభద్రస్వామి ఆలయం

మహబూబాబాద్ జిల్లా కురవి వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ అర్చకులు వాహనాలకు పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు కోళ్లు, మేకలను బలి ఇచ్చి, ఆలయ పరిసరాల్లో విందులు చేసుకున్నారు. శివ నామస్మరణతో ఆలయం మార్మోగింది.