అడవిదేవులపల్లి మండలానికి బస్సు సౌకర్యం కల్పించాలి వినతి

NLG: అడవిదేవులపల్లి మండలానికి బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని మిర్యాలగూడ డిపో మేనేజర్ రామ్మోహన్ రెడ్డికి 'ఫ్రెండ్స్ ఫరెవర్' ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. శనివారం వారు మాట్లాడుతూ.. గతంలో 4 బస్సులు నడిచేవని, ఇప్పుడు ఒక్క బస్సు మాత్రమే మండల కేంద్రానికి వస్తుందన్నారు. గ్రామస్తుల, విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. తిరిగి బస్సులను నడపాలన్నారు.