రేపు ముక్కమల్లలో పర్యటించనున్న మంత్రి

రేపు ముక్కమల్లలో పర్యటించనున్న మంత్రి

NDL: సంజామల మండల పరిధిలోని ముక్కమల్లలో శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించనున్నట్లు గురువారం సంజామల టీడీపీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. కాశిరెడ్డి నాయన ఆరాధన ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి వృషభరాజుల బలప్రదర్శన పోటీలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించింది. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరింది.