ఆయన వయసుకైన విలువ ఇవ్వాలి: మంత్రి

ఆయన వయసుకైన విలువ ఇవ్వాలి: మంత్రి

HYD: అసెంబ్లీలో మంత్రి అజారుద్దీన్ బీఆర్ఎస్ సభ్యుల తీరును తప్పుబట్టారు. కడియం శ్రీహరి వయసుకైనా విలువ ఇవ్వాలని ఆయన అన్నారు. BRS MLA పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తనను అదుపు చేయాలని సూచించారు. కొత్త సంస్కరణలు తెస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకోవద్దని, సభలో మహిళా సభ్యులు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకుని హుందాగా ప్రవర్తించాలని ఆయన కోరారు.