ఆదోని నుంచి 65 బస్సుల్లో మహిళలకు ఉచితం

KRNL: ఆదోని ఆర్టీసీ డిపో నుంచి 65 బస్సు సర్వీసులలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నామని ఆర్టీసీ డీఎం రఫీక్ మహమ్మద్ శనివారం తెలిపారు. స్టార్ లైన్, నాన్ స్టాప్, ఇంటర్ స్టేట్ బస్సు సర్వీసులు మినహా మిగతా బస్సుల్లో రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. ఆధార్, ఓటర్, రేషన్ కార్డు గుర్తింపు కోసం చూపించాల్సి ఉంటుందన్నారు.