చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి
బాపట్ల ఫ్లైఓవర్‌పై అపస్మారక స్థితిలో పడి ఉన్న 65 ఏళ్ల వృద్ధుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మృతిచెందినట్లు బాపట్ల మహిళా ఏఎస్సై సుగుణ తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రిని లేదా అవుట్ పోస్ట్ పోలీసులను 9441305691 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. అపరిచిత వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.