రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

PLD: ఎడ్లపాడు మండలం బోయపాలెం జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నుంచి బైక్‌పై చిలకలూరిపేట వస్తున్న దంపతులు ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న మహిళ కింద పడి అక్కడికక్కడే మరణించింది. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.