గుండెపోటుతో లైన్‌మెన్ మృతి
ప్రకాశం: కోమరోలు మండలం తాటిచెర్ల విద్యుత్ శాఖ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న M. బీకోజీ నాయక్ శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. కొమరోలు విద్యుత్ శాఖ ఏ.ఈ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లైన్‌మెన్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం పుల్లలచెరువులో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.