Dy. CM నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం
KMM: గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర ఫలితాలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలోని మాటూరుపేటలో కాంగ్రెస్ ఘన విజయం సాధించారు. హోరా హోరీగా సాగిన కౌంటింగ్‌లో 10 వార్డులకు 10 కైవసం చేసుకుంది. ఈ విజయం పట్ల కాంగ్రెస్ నాయకులు బాణా సంచా కాలుస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.