లెక్చరర్ పై చర్యలు తీసుకోండి: TGVP

NZB: నగరంలోని ప్రైవేట్ ఇంటర్ కళాశాలలో మైనర్ విద్యార్థినిని శారీరకంగా వేధించిన లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని TGVP జిల్లా అధ్యక్షుడు కళ్యాణ్ డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం వినాయక నగర్‌లోని కళాశాల ఎదుట నిరసన చేపట్టారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలికపై లెక్చరర్ వేధింపులకు పాల్పడడం సరికాదన్నారు. లెక్చరర్‌పై పోక్సో కేసు నమోదు చేయాలన్నారు.