కించపరిచే పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్పీ

కించపరిచే పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్పీ

ప్రకాశం: వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో ఇతరులను కించపరిచేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోల మార్ఫింగ్, ట్రోలింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.