'సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి'
ASF: సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సిర్పూర్ MLA హరీష్ బాబు కోరారు. శనివారం మంత్రి నివాసంలో వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పలు పెండింగ్ ప్రాజెక్టుల గురించి వివరించారు. స్పందించిన మంత్రి త్వరలో పెండింగ్ ప్రాజెక్టుల అంశంపై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.