నాటుసారా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

KRNL: తుగ్గలిలో నాటుసారా తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణారెడ్డి, ఎస్సై మల్లికార్జున హెచ్చరించారు. శుక్రవారం ఎక్సైజ్, జొన్నగిరి పోలీసులు సంయుక్తంగా రోళ్లపాడు తండాలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి 5లీటర్ల సారా, 50 కేజీల బెల్లాన్ని సీజ్ చేశారు. వెంకటనాయక్‌పై కేసు నమోదు చేశారు.