ప్రతిభను వెలికి తీసేందుకే టాలెంట్ టెస్ట్
MNCL: విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే టాలెంట్ టెస్టులను నిర్వహించడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అన్నారు. గురువారం హాజీపూర్ మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న జడ్పీ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్టులో గెలుపొందిన విజేతలకు ఆయన బహుమతులను అందజేశారు.