VIDEO: 'హోమ్ గార్డ్ జీతాలు పెంచాలి'
VSP: హోమ్ గార్డుల జీతాలను వెంటనే పెంచాలని ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు కోరారు. శనివారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. తక్కువ వేతనాలతో హోమ్ గార్డులు కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. పోలీసులతో కలిసి కీలక సేవలు అందిస్తున్నప్పటికీ వారికి సరైన వేతనం లభించడం లేదని పేర్కొన్నారు. వారి సేవలను గుర్తించి జీతాలు పెంచడంతో పాటు సంక్షేమ చర్యలు తీసుకోవాలన్నారు.