దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు

దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు

నల్గొండ: యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని భువనగిరి రోడ్డులో గల పాల కేంద్రం వద్ద తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని మంగళవారం ఆలేరు, తుంగతుర్తి ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, మందుల సామేలు ఆవిష్కరించి మాట్లాడారు. వారి స్ఫూర్తిని నేటి యువత తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.