ఉద్యోగులపై కందుకూరు ఎమ్మెల్యే ఫైర్

NLR: కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం(మ) కళవళ్ల గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. సచివాలయంలో సిబ్బంది లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ ఆనంద్‌కు సచివాలయ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. మీ ఏరియాలోనూ ఉద్యోగులు ఇలానే ఉంటే తెలపమని ఆయన వెల్లడించారు.